Nellore: నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ. 10 లక్షల విరాళం!

Nellore: నెల్లూరులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం అందించిన దగదర్తికి చెందిన తాళ్ళూరి సోదరులు. అభినందించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల.

A Praveen, Nellore
Published on: 11 Nov 2026 1:34 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ. 10 లక్షల విరాళం!

Nellore: నెల్లూరులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి దగదర్తి గ్రామానికి చెందిన తాళ్ళూరి వెంకట కృష్ణ ప్రసాద్, తాళ్ళూరి రవిప్రసాద్ తమ తండ్రి స్వర్గీయ తాళ్ళూరి రమణయ్య నాయుడు జ్ఞాపకార్థం రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు.

బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఐఆర్‌సీఎస్ క్యాన్సర్ హాస్పిటల్ కోఆర్డినేటర్ యాలమూరి రంగయ్య నాయుడు, డీఆర్ఓ ఎన్. విజయ్ కుమార్ సమక్షంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఈ విరాళాన్ని అందజేశారు.

పేద, నిరుపేద క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో, తమ తండ్రి జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అందించినట్లు తాళ్ళూరి సోదరులు తెలిపారు. జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధి ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల దాతలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore