Gudur: గూడూరు ఎస్‌కేఆర్ కళాశాలలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర

Gudur: గూడూరు ఎస్‌కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. క్యాంపస్‌లో శ్రమదానం చేసి విద్యార్థులు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 19 Sept 2026 7:27 PM IST
Gudur
X

Gudur: గూడూరు ఎస్‌కేఆర్ కళాశాలలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర

గూడూరు: ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక అవగాహన పారిశుధ్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రామ్ ప్రసాద్ నాయకత్వం వహించారు.

కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కిరణ్మయి, ఎస్. ఏ.ఎస్. ఏ. కో-ఆర్డినేటర్ డా. ఎ. వి. ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు.

పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యం మేధో వికాసానికి ఎంతగానో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. అనంతరం ప్రిన్సిపాల్ ,సిబ్బంది , విద్యార్థులు కలిసి కళాశాల క్యాంపస్ లో శ్రమదానం చేసి పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి పారిశుధ్య పనులు చేపట్టారు.

విద్యార్థులు తమ తరగతి గదులను, ప్రయోగశాలలను శుభ్రం చేశారు, జెకెసి ల్యాబ్లో విద్యార్థులు ఇ-వ్యర్థాలను నిర్వహించారు. కార్యక్రమం ముగింపులో, పరిసరాల పరిశుభ్రతను నిరంతరం కాపాడుకుంటామని మరియు "స్వచ్ఛ ఆంధ్ర" లక్ష్య సాధనకు కృషి చేస్తామని కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులందరూ కలిసి "స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ" చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్