Nellore: స్వచ్ఛాంధ్ర అవార్డులు అందజేసిన నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్ల!

Nellore: నెల్లూరు కలెక్టరేట్‌లో మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని జిల్లాలోని 79 మంది విజేతలకు స్వచ్ఛాంధ్ర అవార్డులను కలెక్టర్ హిమాన్షు శుక్ల అందజేశారు.

A Praveen, Nellore
Published on: 5 Oct 2026 5:56 PM IST
Nellore
X

Nellore: స్వచ్ఛాంధ్ర అవార్డులు అందజేసిన నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్ల!

Nellore: స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహాన్ని, సరికొత్త స్ఫూర్తిని నింపుతాయని, ఇదే స్ఫూర్తితో స్వచ్ఛమైన నెల్లూరు సాధనకు ప్రతి ఒక్కరూ మరింత అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు.

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రధానం చేసిన స్వచ్ఛాంధ్ర అవార్డులలో భాగంగా జిల్లాలో ఎంపికైన 79 మంది అవార్డు గ్రహీతలకు సోమవారం6 కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవార్డులు అందుకున్న వారిలో నూతన ఉత్సాహాన్ని, సరికొత్త స్ఫూర్తిని నింపుతాయని అన్నారు. ఇదే ఉత్సాహంతో ఉద్యోగులు ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించాలని సూచించారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో ప్రజలకు, విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందించేలా సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

జిల్లాలో స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛతా వారియర్స్, స్వచ్ఛ కాలనీలు, స్వచ్ఛ పార్కులు, స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ హాస్టళ్లు, స్వచ్ఛ పరిశ్రమలు, స్వచ్ఛ రైతుబజార్లు, స్వచ్ఛ బస్టాండ్లు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు తదితర విభాగాల్లో మొత్తం 26 కేటగిరీలలో విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులు, వివిధ రంగాల ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను అవార్డులకు ఎంపిక చేశారు. ఎంపికైన 79 మందికి జిల్లా కలెక్టర్ జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు.

స్వచ్ఛతను నిరంతరం కొనసాగిస్తూ జిల్లాను పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కలెక్టర్ కోరారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ వో విజయ్ కుమార్, నగర కమిషనర్ నందన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకట్రామన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్ భాస్కర్, డిఆర్డిఎ పిడి నాగరాజకుమారి, మెప్మా పిడి కిరణ్‌కుమార్, ఐటిడిఎ పీవో శ్రీనివాసరావు, డిఇఓ ఆర్. బాలాజీరావు, పరిశ్రమల శాఖ జిఎం శ్రీధర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore