Udayagiri: ఉదయగిరికి ట్యాంకర్లతో మంచినీరు ఇవ్వాలి: JCకి వినతి

Udayagiri: ఉదయగిరిలో తీవ్ర మంచినీటి కొరతను తీర్చేందుకు ట్యాంకర్లతో నీరందించాలని, పంచాయతీ నిధుల సంక్షోభాన్ని పరిష్కరించాలని జేసీకి సామాజిక కార్యకర్త ఫయాజ్ విజ్ఞప్తి చేశారు.

A Praveen, Nellore
Published on: 12 Oct 2026 3:43 PM IST
Udayagiri
X

Udayagiri: ఉదయగిరికి ట్యాంకర్లతో మంచినీరు ఇవ్వాలి: JCకి వినతి

Udayagiri: ఉదయగిరి పట్టణంలో తీవ్రమైన మంచినీటి కొరత ఉంది. దానిని తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్ట్ ఫయాజ్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా వేదికలో ఈ మేరకు వినతిని అందజేశారు.

ఉదయగిరిలో ఎల్నినో కారణంగా వర్షాలు పడలేదు. భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. తీవ్ర మంచి నీటి కొరత ఏర్పడింది. మోటర్లకు నీరు సరిగా అందడం లేదు. ఈ కారణంగా మంచినీటి సరఫరా పథకం ద్వారా నీటి సరఫరా కు ఇబ్బంది కలుగుతోంది. రెండు మూడు రోజులకు మంచినీటిని వదులుతున్నారు. ఇందువల్ల ఉదయగిరి వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు నెల రోజులుగా ఇదే పరిస్థితి. మీరు దయవుంచి మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయమని కోరారు. వర్షాలు పడేంత వరకు మంచినీటి సరఫరా చేయాల్సిందిగా అభ్యర్థించారు. జేసీ సానుకూలంగా స్పందించి గ్రామీణ నీటి సరఫరా అధికారికి వెంటనే టాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిందిగా ఆదేశించారు.

ఉదయగిరి పంచాయతీకి నిధుల కొరతను తీర్చండి

ఉదయగిరి పంచాయతీలో తీవ్రమైన నిధుల కొరత ఏర్పడింది . పంచాయతీ స్వీపర్ చిన్నయ్యకు కోర్టు ఆదేశాలతో 12 లక్షల రూపాయల పైచిలుకు నిధులను పంచాయతీ నుంచి చెల్లించాల్సి వచ్చింది. దీంతో పంచాయతీ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు లేవు. చెత్త ఎత్తే ట్రాక్టర్లకు డీజిల్ కూడా లేదు. పెట్రోల్ బంక్ సిబ్బంది ఇకపైన అప్పులు ఇవ్వలేమని చేతులెత్తేశారు.

పంచాయతీ ఈవో వెంకటేశ్వర్లు గారు తన సొంత నిధులను కొంతవరకు వెచ్చించినా పరిస్థితి మెరుగు పడలేదు. ఈ విషయాన్ని సామాజిక కార్యకర్త ఫయాజ్, జేసి వెంకటేశ్వర్లు గారి దృష్టికి తీసుకెళ్లగా జిల్లా పంచాయతీ అధికారిని పిలిచి వెంటనే సమస్య తీర్చమని ఆదేశించారు.

ఉదయగిరి ఫయాజ్,

సామాజిక కార్యకర్త,

A Praveen, Nellore

A Praveen, Nellore