Sullurupeta: సూళ్ళూరుపేటలో ముగిసిన ప్రచారం: కఠిన చర్యలు!
Sullurupeta: సూళ్ళూరుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియడంతో భద్రత పెంచారు. ప్రలోభాలకు గురిచేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని సీఐ మురళీకృష్ణ హెచ్చరించారు.
Sullurupeta: సూళ్ళూరుపేటలో ముగిసిన ప్రచారం: కఠిన చర్యలు!
Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలో హోరాహోరీగా సాగిన ఎన్నికల బహిరంగ ప్రచార ఘట్టానికి గురువారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని,
ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డిఎస్పీ జి. చెంచుబాబు పర్యవేక్షణలో చేపడుతున్న భద్రతా చర్యలు, తనిఖీల వివరాలను సీఐ ఎం. మురళీకృష్ణ మీడియాకు వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట భద్రతా వ్యూహాన్ని అమలు చేస్తున్నామని సీఐ ఎం.మురళీకృష్ణ స్పష్టం చేశారు. 30 సాయంత్రం 5గంటల నుంచి ఎలాంటి బహిరంగ ప్రచారాలు, సభలు, సమావేశాలు, బైక్ ర్యాలీలు నిర్వహించకూడదని, మైకులు, లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని స్పష్టం చేశారు.
ప్రచారం నిమిత్తం బయటి ప్రాంతాల నుంచి వచ్చిన స్థానికేతర రాజకీయ నాయకులు, కార్యకర్తలు వెంటనే సూళ్ళూరుపేట సరిహద్దులు దాటి వెళ్లాలని ఆదేశించారు. లాడ్జీలు, కళ్యాణమండపాలు, కమ్యూనిటీ హాళ్లలో ప్రత్యేక పోలీసు బృందాలతో ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు.
ఓటర్లను ఆకర్షించేందుకు నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేసినా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఒత్తిళ్లకు పాల్పడినా నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై సైబర్ నిఘా ఉంచామని, రాజకీయ పార్టీలు పరస్పర ఘర్షణలకు తావివ్వకుండా సంయమనం పాటించాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రజలందరూ ధైర్యంగా వచ్చి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సీఐ ఎం. మురళీకృష్ణ పిలుపునిచ్చారు.




