Nellore: శ్రీసిటీ ప్రమాదంపై మంత్రి నారాయణ దిగ్భ్రాంతి.. అండగా ఉంటామని హామీ

Nellore: శ్రీసిటీ టిల్ హెల్త్‌కేర్ బాయిలర్ పేలుడు ఘటనపై మంత్రి పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 3 Oct 2026 6:03 PM IST
Nellore
X

Nellore: శ్రీసిటీ ప్రమాదంపై మంత్రి నారాయణ దిగ్భ్రాంతి.. అండగా ఉంటామని హామీ

Nellore: బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి నారాయణ... టిల్ హెల్త్‌కేర్ బాయిలర్ పేలుడు ఘటనపై మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

శ్రీసిటీలోని టిల్ హెల్త్‌‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటనపై రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లాల అధికారులను ఆదేశించడమే కాకుండా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE