Rapur: అందరి చూపు 'రాపూరు బిట్-3' వైపే.. ఆసక్తి రేపుతున్న ఎంపీటీసీ సమరం!

Rapur: నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. రాపూరు బిట్-3 స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బీసీ నేత బొక్కసం రమేష్ వైపే ఇప్పుడు అందరి చూపు నిలిచింది.

Yellayya, Nellore
Published on: 25 Oct 2026 1:26 PM IST
Rapur
X

Rapur: అందరి చూపు 'రాపూరు బిట్-3' వైపే.. ఆసక్తి రేపుతున్న ఎంపీటీసీ సమరం!

Rapur: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు సామాజిక సమతుల్యత సాధించడంలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయి.ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం ఆసక్తికరంగా మారింది. 2021 స్థానిక సమరంలోనూ, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ రాపూరు మండల పరిధిలోని 13 ఎంపీటీసీ స్థానాలలో సాంకేతిక, ఇతర కారణాల వల్ల బీసీ వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్ ఖరారు కాలేదు.

బీసీ వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం 34% రిజర్వేషన్ల దిశగా సానుకూల నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఉన్న కొన్ని చట్టపరమైన, సాంకేతిక పరిస్థితుల వలన ఈ ఎన్నికల నాటికి ఆ రిజర్వేషన్లను అమలు కాలేదు.

బరిలో రమేష్ రాపూరు మండలంలో మొత్తం 38,304 ఓట్లు ఉండగా, అందులో బిసి ఓటర్లు 13,078 మందితో 34 శాతానికి పైగా ఆధిపత్యం కలిగి ఉన్నారు.. మండలవ్యాప్తంగా మొత్తం 13 ఎంపీటీసీ స్థానాల్లో 57 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, బీసీ వర్గానికి చెందిన నేత సైదాదుపల్లి గ్రామానికి చెందిన బొక్కసం రమేష్ రాపూరు బిట్-3 స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ గుర్తుపై నామినేషన్ వేసి పోటీలో నిలిచారు.

53 మంది నామినేషన్లలో బీసీ సామాజికవర్గం నుండి వచ్చిన ఏకైక ప్రతినిధి కావడం వల్ల ఈ స్థానం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ వర్గానికి కేటాయించని జనరల్ లేదా ఇతర కేటగిరీ పరిస్థితులు ఉన్నప్పటికీ, తమ సామాజికవర్గం తరఫున ముందుకొచ్చిన బొక్కసం రమేష్‌కి పార్టీ అధిష్టానం ఎంతవరకు ప్రోత్సాహం అందిస్తుందనేది వేచి చూడాలి.

బీసీ వర్గాల పట్ల సానుకూల దృక్పథంతో ఉండే పార్టీ నాయకత్వం, ఈ విషయంలో ఒక సమతుల్య నిర్ణయాన్ని తీసుకుని మద్దతుగా నిలుస్తుందని స్థానిక నాయకులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బీసీలకు పెద్దపీట వేస్తామన్న అధిష్టానం..

రాపూరు బిట్ -3 విషయం లో న్యాయం జరిగేనా ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యపడకపోయినప్పటికీ, వారికి ప్రాధాన్యం ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టమైన ప్రకటన చేశారు.

ఈ నేపథ్యంలో మండలంలో బీసీ సామాజిక వర్గానికి కేటాయించిన ఏకైక స్థానం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. పార్టీ అగ్రనేతలు ఇచ్చిన హామీ మేరకు అధిష్టానం ఈ స్థానం విషయంలో బీసీలకు పూర్తి న్యాయం చేస్తుందని, తమ వర్గానికి తగిన గుర్తింపు ఇస్తుందని స్థానిక బీసీ నాయకులు, ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore