Muthukuru: కృష్ణపట్నంలో రూ.5.65 కోట్లతో అభివృద్ధి: సోమిరెడ్డి

Muthukuru: ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో రూ.5.65 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 Sept 2026 9:19 PM IST
Muthukuru
X

Muthukuru: కృష్ణపట్నంలో రూ.5.65 కోట్లతో అభివృద్ధి: సోమిరెడ్డి

Muthukuru: ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని రాగాల శివకృష్ణ ద్వారా ఆవిష్కరణ జరగడం సంతోషకరమని అన్నారు. పెద్దాయన రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

స్వర్గీయ నందమూరి తారకరామారావు పేదల పాలిట దేవుడని కొనియాడారు. ఎన్టీఆర్ దేశంలోనే మొదటిసారిగా రూపాయికి కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామానికి సంబంధించి ఐదు పాయింట్ 65 కోట్ల రూపాయల తో ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి సర్వేపల్లి రిజర్వాయర్ రివిట్మెంట్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

2015 వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సర్వేపల్లి రిజర్వాయర్ మీద నడిచి వెళ్లి పరిశీలించిన పరిస్థితి ఉన్నదని తెలిపారు. రిజర్వాయర్ పనులకు టెండర్లు పిలవడం జరిగిందని 10 లక్షల రూపాయలు పని జరిగితే మూడు లక్షల 50 వేల రూపాయలు వివిధ రకాలైన టాక్స్ లకు పోతున్నాయని తెలిపారు. ఏ కాంట్రాక్టరైనా పని చేసిన తర్వాత బిల్లు పెట్టుకుని తీసుకోవాల్సిందే అని అన్నారు.

గత వైసిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పనులు చేయకుండా ఆఫీసుల్లో కూర్చుని బిల్లులు తీసుకున్న పరిస్థితి. ఇరిగేషన్ కాలువ పూడికతీతలు పనులు సమర్థవంతంగా కచ్చితంగా పనులు పూర్తిగా జరుగుతున్నాయని తెలిపారు. రైతుల కు సంబంధించి ఏ పనిలో అయినా రాజీ లేకుండా సమర్థవంతంగా పూర్తి చేస్తామని సోమిరెడ్డి హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం ఇరిగేషన్ అవినీతి కారణంగా ఇరిగేషన్ ఈఈ ఎస్సీ కృష్ణమోహన్ లను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారని తెలిపారు. వైసిపి ప్రభుత్వం నీరు చెట్టు పనులు రూపాయి టాక్స్ కింద గ్రావెల్ అక్రమంగా లేఔట్లకు తోలుకొని కోట్ల రూపాయలు దోసుకున్నారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. వైసిపి ప్రభుత్వం చేసిన పాపాలకు దుర్మార్గాలకు ఎంతోమంది అధికారులు బలి అయ్యారని సస్పెండ్ అయ్యాయన్నారు.

సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ ఏఎన్నార్ వారు తోలుకొని నెలకు 14 కోట్ల రూపాయలు టాక్స్ రూపేనా గవర్నమెంట్ కు చెల్లిస్తున్నారని తెలిపారు. మేము కంపెనీల దగ్గర డబ్బులు అడగడం లేదు సి ఎస్ ఆర్ నిధులను ఖర్చు పెట్టండి అని అడుగుతున్నామని అన్నారు.

నియోజవర్గంలో ఉన్న అతని పోర్టు సేల్ కంపెనీ ఇతర కంపెనీల ద్వారా వస్తున్న సి ఎస్ ఆర్ నిధులు ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెట్టుతున్న దుస్థితి గత ప్రభుత్వంలో ఉన్నదని ఇప్పుడు కంపెనీలు వద్ద సి ఎస్ ఆర్ నిధులు స్థానిక ప్రజలకే చెందాలని ముత్తుకూరు హై స్కూల్ కు అదనపు గదులు ఎస్టీ గిరిజనులకు సి ఎస్ ఆర్ నిధులు ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నదని తెలిపారు.

గత ప్రభుత్వంలో సిఎస్ఆర్ నిధులను పేదలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ జిల్లా నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షుడు రాగల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్