Nellore: తోటపల్లిగూడూరులో ఎమ్మెల్యే సోమిరెడ్డి ధాటి ప్రచారం!

Nellore: తోటపల్లిగూడూరు మండలంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విస్తృత ప్రచారం. కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి అండగా నిలవాలని ఓటర్లకు పిలుపు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Oct 2026 8:38 AM IST
Nellore
X

Nellore: తోటపల్లిగూడూరులో ఎమ్మెల్యే సోమిరెడ్డి ధాటి ప్రచారం!

Nellore: తోటపల్లి గూడూరు మండలం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. జెడ్పీటీసీ అభ్యర్థి జానా రజని, వరిగొండ ఎంపీటీసీ అభ్యర్థులు పేరం శోభారాణి, జానా జగదీష్, టీపీగూడూరు అభ్యర్థి మన్నెం విమల, పోట్లపూడి-విలుకానిపల్లి అభ్యర్థి గళ్లా ప్రవళ్లిక, పాపిరెడ్డిపాళెం-ఇస్కపాళెం ఇంగిలాల నిర్మలమ్మను గెలిపించాలని కోరుతూ ఆయా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.సైకిల్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధి, సంక్షేమానికి అండగా నిలవాలని ప్రజలకు సోమిరెడ్డి పిలుపునిచ్చారు.

తోటపల్లిగూడూరు నా సొంత మండలం,మా బంధువర్గం అంతా ఇక్కడే ఉందని ఈ సందర్భంగా సోమిరెడ్డి గుర్తుచేసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నాకు 5 వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారని ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతకు మించి మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలు రాజ్యమేలాయి,ప్రభుత్వ భూములన్నింటిని చెరపట్టారని, దళితులు, గిరిజనుల పొలాలతో పాటు స్కూళ్లు, ఆలయాల భూములకు రక్షణ లేకుండా చేశారని,ఇన్ని నేరాలు ఘోరాలకు పాల్పడిన పెద్దమనుషులు ఇప్పుడు మాపై నోర్లు పారేసుకోవడం దుర్మార్గం అని అన్నారు.

అలాంటి వారి నోళ్లు మూతపడాలంటే ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.కూటమి ప్రభుత్వం దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని,ఎన్టీఆర్ భరోసా పింఛన్ గా రూ.4 వేలు, రూ.6 వేలు, రూ.10 వేలు, రూ.15 వేలు అందించడం దేశంలోనే ఒక చరిత్ర అని అన్నారు.

ఇంట్లో ఎంత బిడ్డలు స్కూలుకు వెళితే అందరికీ తల్లికి వందనం పథకం అమలవుతోందని,స్త్రీశక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దీపం పథకంలో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందుతున్నాయని,వైసీపీ పాలనలో ఆ నిధులను ఇష్టారాజ్యంగా డైవర్ట్ చేసి పల్లెల అభివృద్ధిని విస్మరించారని అన్నారు.

పల్లెల అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధులను ప్రతి రూపాయిని స్థానిక సంస్థలకే ఖర్చుపెట్టేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాచరణలో ఉన్నారని ఆయన అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్