Somireddy: డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధం ఎమ్మెల్యే సోమిరెడ్డి సవాల్!

Somireddy: డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధమన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. అక్రమాస్తులు, వివేకా హత్య కేసుల్లో నిజాలు అంగీకరించాలని సవాల్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 Sept 2026 8:37 AM IST
Somireddy
X

Somireddy: డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధం ఎమ్మెల్యే సోమిరెడ్డి సవాల్!

Somireddy: సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన నివాసం నుంచి మీడియా సమావేశం నిర్వహించారు. అత్యంత పకడ్బందీగా జరిగిన డీఎస్సీపై సీబీఐ విచారణ అంటూ వైసీపీ రాద్ధాంతం చేస్తోందని ఆయన అన్నారు. సీబీఐపై అంత నమ్మకం ఉంటే మా నుంచి ఒక్క షరతు కచ్చితంగా ఒప్పుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

ఆ డిమాండ్ ఏమిటంటే 2012కు ముందు జగన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.43 వేల కోట్ల అక్రమాస్తులు కూడా గట్టారని సీబీఐ కేసులు నమోదు చేసిందని,ఆ రోజు సీబీఐ కరెక్ట్ కాదంటూ జగన్మోహన్ రెడ్డి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారని,బెయిల్ తెచ్చుకుని అప్పటి నుంచి ఇప్పటిదాకా కోర్టులో కేసులు నడుపుతూనే ఉందన్నారు.

దాదాపు 15 సంవత్సరాలుగా కేసులు నడుస్తూనే ఉన్నాయి.అయినా సీబీఐపై నమ్మకం లేదన్నారు.బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి దగ్గర నుంచి చాలా మందిని ముద్దాయిల్ని చేశారని ఆయన అన్నారు. ఆ కేసులో కూడా సీబీఐ కరెక్ట్ కాదంటూ అందరూ బెయిళ్లు తెచ్చుకుని కోర్టులో కౌంటర్లు దాఖలు చేస్తున్నారని,

వైసీపీకి నిజంగా సీబీఐపై నమ్మకముంటే మొదట రూ.43 వేల కోట్లు కట్టేయండని ఆయన డిమాండ్ చేశారు.బాబాయి హత్య కేసులో సీబీఐ ముద్దాయిలుగా తేల్చినవారందరినీ కోర్టుకు సరెండర్ కావాలని డిమాండ్ చేయటం జరిగింది.

సీబీఐ కోర్టుకు తెలిపిన వాస్తవాలను అంగీకరించి, కౌంటర్లను వెనక్కి తీసుకోవాలని,ఈ రెండు జరిగిన వెంటనే నేను మా నాయకుడు, సీఎం చంద్రబాబు నాయుడిని ఒప్పించి డీఎస్సీపై సీబీఐ విచారణ వేయిస్తామని స్పష్టం చేశారు.

డీఎస్సీ అత్యంత పకడ్బందీగా జరిగింది. సీబీఐ విచారణ జరిపించడానికి మా ప్రభుత్వానికి ఎటువంటి భయం లేదన్నారు.మా లోకేష్ బాబుకీ ఎటువంటి భయం లేదని ఆయన స్పష్టం చేశారు. 16372 ఉపాధ్యాయ పోస్టుల్లో కానీ, స్పోర్ట్స్ కోటాలో కానీ ఎక్కడా అక్రమాలకు ఆస్కారమే ఇవ్వలేదన్నారు.

ఐదేళ్ల తర్వాత నిర్వహించిన డీఎస్సీలో 16372 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందడం చూసి వైసీపీ నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారని అన్నారు. డీఎస్సీ పై సీబీఐ విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చినా, చివర్లో మాకు నమ్మకం లేదు,విచారణ బాగా జరగలేదని అంటారని ఆయన అన్నారు.

వైసీపీకి నిజంగా నమ్మకం ఉంటే అక్రమాస్తుల కేసుతో పాటు బాబాయి హత్య కేసు విచారణల్లో సీబీఐ తేల్చిన అంశాలను వాస్తవాలు అని ఒప్పుకోవాలి సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్