Sarvepalli: తోటపల్లి గూడూరులో టీడీపీ కూటమి అభ్యర్థుల విజయం కోసం సోమిరెడ్డి ప్రచారం!
Sarvepalli: తోటపల్లి గూడూరులో టీడీపీ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రచారం. గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు, అభివృద్ధి హామీలు.
Sarvepalli: తోటపల్లి గూడూరులో టీడీపీ కూటమి అభ్యర్థుల విజయం కోసం సోమిరెడ్డి ప్రచారం!
Sarvepalli: తోటపల్లి గూడూరు తెలుగుదేశం కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని సోమిరెడ్డి అన్నారు. జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల ప్రచారాన్ని కోడూరు నుంచి ప్రారంభిస్తున్నామని సోమిరెడ్డి తెలిపారు. అలాగె జడ్పిటిసి అభ్యర్థిగా జానా రజిని ఎంపీటీసీ అభ్యర్థులుగా కోడూరు కు సంబంధించి బిట్ -1 బూదురు శ్రీనివాసులు బిట్ -2 సంబంధించి కావలిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి అధిక మెజారిటీతో ఈ ముగ్గురిని గెలిపించాలని అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలో 5 జడ్పిటిసి 5 ఎంపీపీ లను గెలిపించుకోవడం మనందరి బాధ్యత అని సోమిరెడ్డి అన్నారు.
తోటపల్లి గూడూరు సంబంధించి కోడూరు మహాలక్ష్మి పురం సెంటర్ నుండి బీచ్ రోడ్డు వేళాంగిణి మాత చర్చి వరకు నాలుగు కోట్ల 50 లక్షలు రూపాయలతో రోడ్డు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం లో ప్రజలు ఎవరైనా నామినేషన్లు వేయాలి అంటే వారి మీద కేసులు పెట్టి జైలు పాలు చేసేవారని ఇప్పుడు పరిస్థితి అలా కాదని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలు ఎవరైనా స్వతహాగా వెల్లి నామినేషన్ వేసుకొని ఎన్నికల్లో పాల్గొని ప్రచారాలు చేసుకోవచ్చని తెలిపారు.
గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా మీ నాన్న మస్తు చేసి ఎలక్షన్ కి నామినేషన్ వేసే వారిని భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూసామని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు జరుగుతున్నాయని గత వైసిపి ప్రభుత్వంలో నేను బటన్ నొక్కుతాను పంచాయతీరాజ్ మూసేస్తాను వ్యవసాయ శాఖ మూసేస్తాను రోడ్లు వేయను అని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు ఇప్పుడు ఏ శాఖకు ఆ శాఖ నిధులు ఉపయోగించుకొని పనిచేయాల్సిందేనని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ శాఖ నిధులు ఒక్క రూపాయి కూడా మళ్ళించే పరిస్థితి నేనే లేదని ఆ శాఖకు ఖర్చు పెట్టుకోవాల్సిందేనని మాట ఇవ్వడం జరిగిందని సోమిరెడ్డి అన్నారు ఎన్ ఆర్ జె సి కింద కోట్ల రూపాయలు నిధులతో గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి చేసుకోవడం జరుగుతున్నదని అన్నారు.
ఉదయగిరి కి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు పల్లె వీక్షణ కింద 11 కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లా కి శాంక్షన్ చేశారని అలాగే నుడా కింద ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు కేటాయించారని ఇంకా ఎన్ ఆర్ జె సి కోట్ల రూపాయలు నిధులు అభివృద్ధి చేస్తూనే ఉన్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మి సురేంద్ర, నీటి పారుదల శాఖ గంగాధర్, తోటపల్లి గూడూరు మండల అధ్యక్షుడు కొనతం రఘుబాబు, చిన్న బాబిరెడ్డి ముత్యాల శ్రీనివాసులు ఆవుల మునిరత్నం, కోడూరు నాయకులు ఆగాల శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు




