Nellore: సోమశిల ముంపు బాధితుల ఉద్యోగాలపై ఎస్‌ఈ రామచంద్రమూర్తి స్పష్టత

Nellore: సోమశిల ప్రాజెక్ట్ ముంపు బాధితుల ఉద్యోగాల కేటాయింపుపై ఎస్‌ఈ రామచంద్రమూర్తి కలువాయిలో స్పష్టత ఇచ్చారు. దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.

Madhav Goud, Nellore
Published on: 10 Oct 2026 3:50 PM IST
Nellore
X

Nellore: సోమశిల ముంపు బాధితుల ఉద్యోగాలపై ఎస్‌ఈ రామచంద్రమూర్తి స్పష్టత

నెల్లూరు: నెల్లూరు జిల్లా కలువాయి సోమశిల ప్రాజెక్ట్ కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న కార్యాలయ భవన సముదయాన్ని ప్రాజెక్టు ఎస్ ఈ రామచంద్ర మూర్తి పరిశీలించారు. ఈ సందర్బంగా సోమశిల ప్రాజెక్టు ముంపు ప్రాంత నిరుద్యోగులు ఎస్ ఈ ని కలిసి ఉద్యోగాల కోసం వినతిపత్రం సమర్పించారు, ఈ సందర్బంగా ఎస్ ఈ మీడియా తో మాట్లాడుతూ సోమశిల ప్రాజెక్ట్ ముంపు ప్రాంత నిరుద్యోగులు ఎవరు అపోహలు నమ్మవద్దన్నారు, సీనియారిటి ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.

1984 వ సంవత్సరం జలాశయం కోసం భూములు సేకరించారని, 1986 వ సంవత్సరంలో జీ ఓ నెంబర్ 98 తీసుకోని వచ్చారని తెలిపారు, రిజర్వాయర్ లో భూములు, ఇల్లు, కోల్పోయిన బాధితులకు ఇంటికి ఒక ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వం బావించిందన్నారు, గతంలో 320 మందికి ప్రభుత్వం ఉద్యోగం తెలిపారు , శ్రీధర్ అనే ఒక వ్యక్తి కోర్టు ద్వారా ఉద్యోగం పొందారన్నారు, ఈ సంవత్సరం కోర్టు ఉత్తర్వులు ప్రకారం సీనియారిటి లేకున్నా 14 మంది ఉద్యోగం పొందారని వివరించారు.

అర్హత లేకున్నా వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారని మాకు ఉద్యోగాలు ఇవ్వాలని 260 మంది లో 80 రిట్ పిటిషన్లు కోర్టు కు దాఖలు చెప్పారు.వాళ్లకు సంబందించిన సర్టిఫికెట్ లు పరిశీలించిన తర్వాత 178 మంది అర్హత ఉందని,20 మందికి అర్హత లేదని కోర్టుకు తెలిపామని చెప్పారు.జీవో 98 ప్రకారం 1656 మంది మాత్రమే అర్హత కలిగివున్నారన్నారు, కుటుంబంలో యజమానులు వాళ్ల పిల్లలకు మాత్రమే అర్హులు అని మిగతా వాళ్లు ఈ ఉద్యోగాలకు అనర్హులని తెలిపారు.

సీనియారిటి కోర్టు ఉత్తర్వులు ప్రకారమే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, ఎవరు ఎటువంటి అపోహలు నమ్మవద్దని... ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. ఉద్యోగం వచ్చే నాటికీ ఆ కుటుంబం లో సభ్యులు ఏవరు ప్రభుత్వ ఉద్యోగులేయ్ ఉండకూడదని వివరించారు. అల ఉంటే ప్రభుత్వం నిబంధనలు ప్రకారం ఉద్యోగం రాదని ముంపు ప్రాంత నిరుద్యోగులకు ఎస్ ఈ వివరించారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore