Nellore: 34% బీసీ రిజర్వేషన్లతోనే సామాజిక న్యాయం: డా. జెడ్ శివప్రసాద్

Nellore: స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లతోనే బీసీలకు సామాజిక న్యాయం దక్కుతుందని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని డాక్టర్ జెడ్ శివప్రసాద్ స్పష్టం చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 2 Oct 2026 8:30 PM IST
Nellore
X

Nellore: 34% బీసీ రిజర్వేషన్లతోనే సామాజిక న్యాయం: డా. జెడ్ శివప్రసాద్

Nellore: తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు బీసీ నేతలు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అంశం, హైకోర్టు తీర్పు, వైసీపీ నేతల కుట్రలపై వారు స్పందించారు. ఈ సమావేశంలో ముదిరాజ్ సాధికార సమితి కన్వీనర్ పి.ఎల్ రావు, ఆప్కాబ్ మాజీ ఛైర్మన్ పాల్ శెట్టి, బాబు గౌడ్, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ జ్ఞానేంద్ర, చెంచు కిషోర్, ఆశం సురేష్, ఈదర శ్రీనివాసులు, షేక్ అమృల్లా, ఖజానా బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ మాట్లాడుతూ....

స్థానిక సంస్థల్లో బీసీలకు సామాజిక సమతుల్యత, ప్రాతినిధ్యం కల్పించాలనే మంచి ఉద్దేశంతో 34 శాతం రిజర్వేషన్లను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేటాయించిందని,

వైసీపీ హయాంలో 34% రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లకుండా బీసీ లకు జగన్మోహన్ రెడ్డి చారిత్రక ద్రోహం చేశారని అన్నారు.. స్థానిక సంస్థల్లో 34% శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బీసీ లకు రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందనే కుట్రతో వైసీపీ నేతలు కోర్టుల్లో పిటిషన్లు వేసి అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు...

వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో 34% శాతం రిజర్వేషన్ ఇవ్వకపోవడం వల్ల 16,800 మంది బీసీలు పదవులను కోల్పోయారని,

వైసీపీ ప్రభుత్వం తమ హయాంలో 51 కార్పొరేషన్లను ఏర్పాటుచేసి ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా బీసీలను ఘోరంగా అవమానించిందని అన్నారు... 5 ఏళ్ల పాలనలో బీసీలపై మానసిక, భౌతిక దాడులు, వేధింపులకు మాత్రమే వైసీపీ ప్రభుత్వం పరిమితం అయిందని చెప్పారు...

అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కళా వెంకట్రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటి బీసీ నేతలను వైసీపీ ప్రభుత్వం హింసించింది.

బీసీలు బోడె రామచంద్ర యాదవ్, నందం సుబ్బయ్య, అమర్నాథ్ గౌడ్ వంటి వారు వైసీపీ ప్రభుత్వ హయాంలో బాధితులుగా నిలిచారని అన్నారు...

బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, సాధికారత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. బీసీ ల డిఎన్ఏ తెలుగుదేశం పార్టీతోనే ఉందని చెప్పారు...

బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, న్యాయపరంగా ఉన్న ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకొని బీసీలకు న్యాయం చేస్తామని చెప్పారు...34% బీసీ రిజర్వేషన్లపై వైసీపీ నేతలు చేస్తున్న కుట్రలను ప్రజలు గుర్తించాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE