Nellore: పొదలకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్!

Nellore: నెల్లూరు జిల్లా పొదలకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్.. కాలిపోయిన వైర్లు, ఇన్వర్టర్. తప్పిన పెను ప్రమాదం.

Yellayya, Nellore
Published on: 20 Sept 2026 12:51 PM IST
Nellore
X

Nellore: పొదలకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్!

Nellore: నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని బాలాజీనగర్‌లో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున షార్ట్‌ సర్క్యూట్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో విద్యుత్‌ వైర్లు, ఇన్వర్టర్‌ కాలిపోయాయి. కార్యాలయ గది నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న సబ్‌ రిజిస్ట్రార్‌ శోభమ్మ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

Yellayya, Nellore

Yellayya, Nellore