Nellore: గాంధీజీ స్ఫూర్తితో అంకితభావంతో పనిచేయాలి: జేసీ వెంకటేశ్వర్లు

Nellore: నెల్లూరు కలెక్టరేట్‌లో గాంధీ జయంతి ఘనంగా జరిగింది. గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 2 Oct 2026 2:32 PM IST
Nellore
X

Nellore: గాంధీజీ స్ఫూర్తితో అంకితభావంతో పనిచేయాలి: జేసీ వెంకటేశ్వర్లు

Nellore: మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

శుక్రవారం కలెక్టరేట్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్లు మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్ఓ విజయ్ కుమార్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి వేణుగోపాల్ తదితరులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, సత్యం, అహింస, శాంతి, సేవ వంటి గాంధీజీ ఆదర్శాలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన మార్గంలో పయనిస్తూ విధుల నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తూ, ప్రభుత్వ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికీ సమర్థవంతంగా అందించేందుకు ఉద్యోగులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE