Nellore: తోటపల్లిగూడూరులో ఘనంగా వరుణ యాగం: వర్షాల కోసం పూజలు
Nellore: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లిగూడూరు శ్రీ కరేశ్వర స్వామి ఆలయంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించారు.
Nellore: తోటపల్లిగూడూరులో ఘనంగా వరుణ యాగం: వర్షాల కోసం పూజలు
తోటపల్లి, గూడూరు: శ్రీ కరేశ్వర స్వామి ఆలయంలో(శివాలయం) ఎల్నీలో ప్రభావంతో ప్రస్తుతం ఎదుర్కొంటున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణతో వరుణ యాగం నిర్వహించారు. ఈ యాగ క్రతువు లో
సర్వేపల్లి నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శృతి దంపతులు దేవస్థానం చైర్ పర్సన్ మన్నెంనీలిమ దంపతులు పాల్గొని దైవభక్తితో వరుణ దేవుని ప్రార్థించారు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి శృతి టిడిపి రాష్ట్ర నేత బొమ్మి సురేంద్ర మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణం పరిస్థితులలో మార్పు కారణంగా వర్షం లేకపోవడంతో రైతులు ప్రజలు అనేక అవస్థలు పడుతున్నట్లు వివరించారు.వరుణ దేవుని దైవ కృపతో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షించారు. వరుణ యాగం ద్వారా వర్షాలు సకాలంలో కురిసి రైతులు పంటలు పండించుకోవాలని, అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
వేద పండితులు పరాంకుశంప్రసాదాచార్యులు,మురళీ కృష్ణమాచారి, వేణుగోపాల చారి అనంత ఆచార్యుల వేదమంత్రాలు ప్రధానంగా అనంత ఆచార్యు ప్రవచనాలు ఆకర్షణగా నిలిచాయి.
ఈ వరుణ యాగంలో రాష్ట్ర టిడిపి నేత బొమ్మి సురేంద్ర,విజయ డైరీ డైరెక్టర్ కోడూరు శ్రీనివాసులు రెడ్డి, తోటపల్లి గూడూరు సహకార బ్యాంక్ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, దేవస్థానం ఈవో దర్గయ్య, తెలుగుదేశం నాయకులు మన్యం జితేందర్ గౌడ్ స్థానిక టిడిపి నేతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




