Nellore: కృష్ణపట్నం-2 ఎంపీటీసీగా మోచర్ల మురళీకృష్ణ నామినేషన్!
Nellore: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం-2 ఎంపీటీసీ అభ్యర్థిగా మోచర్ల మురళీకృష్ణ నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బలపరిచారని తెలిపారు.
Nellore: కృష్ణపట్నం-2 ఎంపీటీసీగా మోచర్ల మురళీకృష్ణ నామినేషన్!
Nellore: సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామానికి సంబంధించిన మోచర్ల మురళీకృష్ణ కృష్ణపట్నం రెండవ సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మాచర్ల మురళీకృష్ణ ను రాగాల శివకృష్ణ బలపరిచారు.
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. ముందుగా కృష్ణపట్నం శివాలయంలో పూజలు నిర్వహించి అనంతరం పెద్ద ఎత్తున కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేశారు.




