Muthukur: సర్వేపల్లికి రూ.14.60 కోట్ల నిధులు: సోమిరెడ్డి

Muthukur: సర్వేపల్లి నియోజకవర్గానికి రూ.14.60 కోట్ల నిధులు మంజూరయ్యాయని, తాళ్లపూడిలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Sept 2026 10:36 PM IST
Muthukur
X

Muthukur: సర్వేపల్లికి రూ.14.60 కోట్ల నిధులు: సోమిరెడ్డి

నెల్లూరు జిల్లా: ముత్తుకూరు మండలం తాళ్లపూడి పంచాయతీ లక్ష్మీనరసాపురంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

తాళ్లపూడి పంచాయతీలో రూ.73.50 లక్షల నిధులతో పనులు జరిగాయి అని అన్నారు.మరో రూ.50 లక్షలతో చేపట్టిన పనులు కొనసాగుతున్నారని,

రెండేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ఈ పంచాయతీ ప్రజలకు రూ.3.89 కోట్ల లబ్ధి చేకూరిందని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రతి గ్రామంలోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.

సీఎస్ఆర్ నిధులతో 45 అంగన్ వాడీ కేంద్రాలు నిర్మించాలని ప్రతిపాదించాంమని, ఇప్పటికే 50 మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తుండగా, మరో 30 ప్లాంట్ల కోసం కూడా ప్రయత్నిస్తున్నామని అన్నారు.2023లో వైసీపీ ప్రభుత్వం రీసర్వే పేరుతో రెవెన్యూ రికార్డులను మార్చేసి ఊళ్లకు ఊళ్లను రభస పట్టించిందని, అప్పట్లో జరిగిన ఆ తప్పులను సరిదిద్దడం అధికారులకు తలకు మించిన భారంగా మారిందని ఆయన అన్నారు.

అధికారులు శ్రమించి రైతులకు తప్పులు లేని పాసుపుస్తకాలు అందిస్తున్నారని, ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా 70 శాతం పాసు పుస్తకాల పంపిణీ పూర్తికాగా, మరో 30 శాతం కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

సంక్షేమ కార్యక్రమాల అమలులో ఏపీ దేశంలోనే నంబర్ 1 స్థానంలో కొనసాగుతోందని, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లుగా రూ.4 వేలు, రూ.6 వేలు. రూ.10 వేలు. రూ.15 వేలు అందిస్తున్నారని, ఏడు రాష్ట్రాలు కలిపి నెలకు రూ2750 కోట్లు పింఛన్లుగా ఇస్తుంటే, ఒక్క మన రాష్ట్రంలోనే రూ.2750 కోట్లు ఇస్తున్నారని అన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఇది సాధ్యమవుతోందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలు చేపట్టాక పంచాయతీలకు నిధుల వరద కురిపిస్తున్నారని అన్నారు.

చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా ప్రగతి సాధిస్తోందని,గతంలో అరాచకాలు, అక్రమాలు రాజ్యమేలితే, ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమంతో రాష్ట్రం విరాజిల్లుతోందని, రూ.3200 కోట్ల మద్యం స్కామ్ లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన జగన్ రెడ్డి ముందు తన పాపాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్