Nellore: వర్షాలు సమృద్ధిగా కురవాలని సంగం ఆలయంలో వరుణ యాగం!

Nellore: నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని సంగమేశ్వర స్వామి ఆలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ వరుణ జపం, వరుణ యాగం నిర్వహణ.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 6 Oct 2026 1:03 PM IST
Nellore
X

Nellore: వర్షాలు సమృద్ధిగా కురవాలని సంగం ఆలయంలో వరుణ యాగం!

Nellore: సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు జిల్లా సంఘం మండల కేంద్రంలో వెలిసే ఉన్న పురాతన శ్రీ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఘనంగా వరుణ జపం,వరుణ యాగం నిర్వహించారు.రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఆలయ ఈఓ రఘురామయ్య,అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య వరుణ దేవునికి జపం, యాగ కార్యక్రమాలు కొనసాగాయి. అర్చకులు జలంలో కూర్చొని వరుణ దేవుని అనుగ్రహం కోసం ప్రత్యేకంగా జపం చేశారు.ఈ సందర్భంగా వరుణ దేవుని కృపతో సంగం ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులకు మేలు చేకూరాలని అర్చకులు ప్రార్థనలు చేశారు.

అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు సంగమేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.భక్తిశ్రద్ధలతో జరిగిన వరుణ జపం, యాగ కార్యక్రమంలో ఆలయ ఈఓ రఘురామయ్య, అర్చకులు,సంగం, ఏ ఎస్ పేట టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులురెడ్డి,అబ్బూరి రమేష్ నాయుడు,

టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి,సంగం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్,కాకు మధుసూదన్ యాదవ్,సంగం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు,గంగిశెట్టి సత్యనారాయణ, భీమేశ్వర రెడ్డి,గునుపూడి గిరి,శ్రీహరి నాయుడు,భక్తులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)