Nellore: రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రికి రూ.7 లక్షల విరాళం
Nellore: నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధి పనుల నిమిత్తం దాత రుద్రపాటి వెంకటేశ్వర్లు నాయుడు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు రూ.7 లక్షల విరాళం అందజేశారు.
Nellore: రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రికి రూ.7 లక్షల విరాళం
Nellore: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు దాత రుద్రపాటి వెంకటేశ్వర్లు నాయుడు రూ.7 లక్షల విరాళాన్ని అందజేశారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా కు చెక్కు రూపంలో ఈ విరాళాన్ని అందించారు.
రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ విరాళాన్ని వినియోగించి, తమ కుటుంబ సభ్యుల పేర్లతో శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలని దాత ఈ సందర్భంగా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి మంచి మనసుతో రూ.7 లక్షల విరాళం అందించిన నరుకూరు సమీపంలోని రైస్ మిల్ యజమాని రుద్రపాటి వెంకటేశ్వర్లు నాయుడును కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్, రెడ్ క్రాస్ సభ్యులు యలమూరి రంగయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.




