Nellore: కోటి సోమవారం.. మూలాపేట శివాలయంలో రూప్ కుమార్ యాదవ్ పూజలు!

Nellore: కార్తీక మాసం కోటి సోమవారం సందర్భంగా నెల్లూరు నగరం మూలాపేట శ్రీ శివాలయంలో డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదం పంపిణీ చేశారు.

A Praveen, Nellore
Published on: 16 Nov 2026 9:26 PM IST
Nellore
X

Nellore: కోటి సోమవారం.. మూలాపేట శివాలయంలో రూప్ కుమార్ యాదవ్ పూజలు!

నెల్లూరు నగరం: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పవిత్రమైన కోటి సోమవారం సందర్భంగా నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ మూలాపేటలోని శ్రీ శివాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పరమశివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. కార్తీక మాసంలో శివయ్యను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు.

A Praveen, Nellore

A Praveen, Nellore