Nellore: కార్పొరేషన్ రూపాయి అక్రమంగా వాడినట్లు నిరూపించాలి కుమార్ యాదవ్!
Nellore: కార్పొరేషన్ నిధులపై ఆరోపణలు నిరూపించాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సవాల్. అర్హతల అంశంపై ఘాటు కౌంటర్.
Nellore: కార్పొరేషన్ రూపాయి అక్రమంగా వాడినట్లు నిరూపించాలి కుమార్ యాదవ్!
Nellore: నెల్లూరు జిల్లా టిడిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్న వైఎస్సార్సీపీ నెల్లూరు నగర ఇన్‌ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి చేసిన విమర్శలకు రూప్ కుమార్ యాదవ్ ఘాటుగా సమాధానమిచ్చారు కమిషనర్ నియామకం, ఆయన అర్హతలపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రశేఖర్ రెడ్డికి అసలు అర్హతల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని రూప్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఇదే బోబులేష్ నందన్ ని నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌గా నియమించింది నిజం కాదా అని నిలదీశారు.
అంతేకాకుండా, అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్ కడపకు వైస్ ఛైర్మన్‌గా కూడా రెండేళ్ల పాటు ఇదే బొబులేష్ నందన్ పనిచేశారని గుర్తుచేశారు.అప్పట్లో చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాల్లో లేకపోవడం వల్లే ఈ విషయాలు తెలియలేదని, నోటికొచ్చినట్లు మాట్లాడకుండా తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.




