Nellore: PGRS అర్జీలను గడువులోగా పరిష్కరించాలి: డీఆర్వో విజయకుమార్

Nellore: పీజీఆర్ఎస్ ద్వారా అందిన ప్రజా సమస్యల అర్జీలను అధికారులు నిర్ణీత గడువులోగా, పారదర్శకంగా పరిష్కరించాలని నోడల్ అధికారి విజయకుమార్ ఆదేశించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 3 Oct 2026 7:13 PM IST
Nellore
X

Nellore: PGRS అర్జీలను గడువులోగా పరిష్కరించాలి: డీఆర్వో విజయకుమార్

Nellore: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్.) ద్వారా అందిన అర్జీలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులపై ఉందని జిల్లా రెవెన్యూ అధికారి, పి.జి.ఆర్.ఎస్. నోడల్ అధికారి విజయకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అధికారులు తమ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న అర్జీలతో పాటు, నేరుగా అందిన అర్జీలను కూడా ప్రతిరోజూ పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు పారదర్శకంగా పరిష్కరించడంతో పాటు, అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

పి.జి.ఆర్.ఎస్. అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, బియాండ్ ఎస్ ఎల్ ఏ లేకుండా అర్జీలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణీత గడువులోగా పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని డిఆర్వో ఆ ప్రకటనలో తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE