Nellore: అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు నెల్లూరు కలెక్టర్!
Nellore: అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఫిర్యాదు రీ-ఓపెన్ అయితే సంబంధిత అధికారే బాధ్యత వహించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా హెచ్చరించారు.
Nellore: అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు నెల్లూరు కలెక్టర్!
Nellore: ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ జరపాలని అధికారులకు సూచించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించడంతోపాటు, నిర్ణీత గడువులోగా ప్రతి అర్జీపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రీ-ఓపెన్ అయితే సంబంధిత అధికారిదే బాధ్యత!
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని, ఒకసారి పరిష్కరించిన ఫిర్యాదు మళ్లీ రీ-ఓపెన్ అయ్యే పరిస్థితి వస్తే సంబంధిత అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు. అర్జీలను కేవలం పరిష్కరించినట్లు నమోదు చేయకుండా, సమస్యకు వాస్తవ పరిష్కారం చూపాలని ఆదేశించారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో అవసరమైన విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్ తదితర అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.




