Nellore: పడమటిపాలెంలో ఘనంగా రాష్ట్రీయ పోషణ మాహ్ ప్రోగ్రామ్!
Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలం పడమటిపాలెంలో రాష్ట్రీయ పోషణ మాహ్ వేడుకలు.. పౌష్టికాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించిన అధికారులు.
Nellore: పడమటిపాలెంలో ఘనంగా రాష్ట్రీయ పోషణ మాహ్ ప్రోగ్రామ్!
Nellore: నేడు 9వ రాష్ట్రీయ పోషణ మాహ్ ప్రోగ్రామ్ ను ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాలతో ఆత్మకూరు ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లా సంగం మండలం పడమటిపాలెం అంగన్వాడి సెంటర్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిడిఓ సునీలత మాట్లాడుతూ పౌష్టికాహార ప్రాముఖ్యతను ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, టీవీ ప్రకటనలు, రేడియో జంగిల్ ద్వారా నెల రోజుల కమ్యూనికేషన్ ప్రచారం నిర్వహించాలని సూచించడం జరిగినది .ఆహార వైవిధ్యం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు మరియు ప్రాంతీయ వంటకాలు మరియు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన కల్పించారు.
ఈరోజు యాక్టివిటీ లో భాగంగా నా అంగన్వాడీ వంట గది_నా భాద్యత ,వంట పాత్రలు పరిశుభ్రత చేతులు శుభ్రత , నా ఆరోగ్యకరమైన ప్లేటు" లైవ్ డెమో, పప్పులు, చిరుధాన్యాలు ఆకుకూరలు, కూరగాయలు పండ్లు, పాలు, గుడ్డు మొదలైన వాటితో ప్లేటు తయారుచేసి సంపూర్ణమైన ఆహారాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలని తెలియజేయడం జరిగినది.
అంగన్వాడీ కేంద్రాలు మరియు పాఠశాలల్లో నూనె ,చక్కెర, ఉప్పు సరైన వినియోగంపై అవగాహన సామాగ్రి ప్రదర్శించడం జరిగినది టి .హెచ్. ఆర్ వంటకాలు, హెచ్. సి .ఎం మెనూ, స్థానిక ఆహార పదార్థాలతో తయారు చేసిన ప్రాంతీయ వంటకాలను ప్రదర్శించడం జరిగినది. ప్రోటీన్ మరియు ఐరన్ అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
అంగన్వాడీ కార్యకర్తలు పోషణ ప్లేట్ తో కలిసి స్థానిక పోషక వంటకాల ప్రదర్శనలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి మరియు అంగన్వాడి కార్యకర్తలు ప్రసన్న ,పద్మ. బాగ్య లక్ష్మి ,వారధి మరియు తల్లులు ,లబ్ధిదారులు పాల్గొన్నారు.




