Rapur: రాపూరు 9వ వార్డులో వైసీపీ అభ్యర్థి మల్లవరం అస్కా ప్రచారం

Rapur: నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ 9వ వార్డు వైసీపీ అభ్యర్థి మల్లవరం అస్కా, సర్పంచ్ అభ్యర్థి ఏటూరు వందనలను గెలిపించాలని ఇంటింటి ప్రచారం.

Yellayya, Nellore
Published on: 25 Nov 2026 8:26 PM IST
Rapur
X

Rapur: రాపూరు 9వ వార్డులో వైసీపీ అభ్యర్థి మల్లవరం అస్కా ప్రచారం

రాపూరు: నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలోని 9వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లవరం అస్కా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి 9వ వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రస్తుత పాలనకు, గత వైఎస్సార్‌సీపీ పాలనకు మధ్య ఉన్న తేడాలను బేరీజు వేసుకొని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థించారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, పేద ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలను దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మల్లవరం అస్కాకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

అదేవిధంగా రాపూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఏటూరు వందనను కూడా ప్రజలు ఆదరించి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వార్డు అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అండగా నిలవాలని నాయకులు, కార్యకర్తలు ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వేటూరు విజయ శేఖర్ రెడ్డి,నల్లగల్ల శంకర్,మోషే, సయ్యద్ హమీద్, శివయ్య, తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలు పాల్గొన్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore