Nellore: నెల్లూరు జిల్లా: రోడ్డుకి అడ్డంగా పడిన చెట్టు తొలగింపు!

Nellore: రాపూరు మండలం తూమాయి వద్ద రోడ్డుపై కూలిన భారీ వృక్షాన్ని ఎస్సై తిరుమలరావు జేసీబీ సహాయంతో తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Yellayya, Nellore
Published on: 24 Sept 2026 6:42 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు జిల్లా: రోడ్డుకి అడ్డంగా పడిన చెట్టు తొలగింపు!

Nellore: నెల్లూరు జిల్లా పొదలకూరు–రాపూరు ప్రధాన రహదారిపై తూమాయి వద్ద భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా నేలకూలింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమాచారం అందుకున్న రాపూరు ఎస్సై జె. తిరుమలరావు వెంటనే స్పందించారు. జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షాన్ని తొలగించి, ట్రాఫిక్‌కు ఏర్పడిన అంతరాయాన్ని వెంటనే నివారించారు. అనంతరం వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్సై తిరుమలరావు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore