Nellore: రాపూరు ఎంపీడీఓ ఆఫీస్‌లో చివరి సాధారణ సర్వసభ్య సమావేశం!
Nellore: రాపూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ప్రసన్న అధ్యక్షతన చివరి సర్వసభ్య సమావేశం. ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో ఘనంగా సన్మానించిన ఎంపీడీఓ వసుంధరమ్మ.
Nellore: రాపూరు ఎంపీడీఓ ఆఫీస్‌లో చివరి సాధారణ సర్వసభ్య సమావేశం!
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కుమ్మరిగుంట ప్రసన్న అధ్యక్షతన చివరి సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ వసుంధరమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జెడ్పీటీసీ చిగురుపాటి ప్రసన్న, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, ఆయా శాఖల ప్రగతి, ప్రజలకు అందుతున్న సేవలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు చర్చించారు. ప్రస్తుత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ఈ నెలతో ముగియనున్న నేపథ్యంలో ఇది చివరి సాధారణ సర్వసభ్య సమావేశంగా ముగిసింది.
ఈ సందర్భంగా ఎంపీపీ కుమ్మరిగుంట ప్రసన్న, జెడ్పీటీసీ చిగురుపాటి ప్రసన్న, ఎంపీటీసీ సభ్యులను ఎంపీడీఓ వసుంధరమ్మ ఘనంగా సన్మానించి, వారి పదవీకాలంలో మండల అభివృద్ధికి అందించిన సేవలను అభినందించారు. కార్యక్రమంలో రాపూరు మండల సొసైటీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీలు పోలంరెడ్డి పెంచల్ రెడ్డి, వేకసరి వెంకటస్వామి, మండల కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.




