Nellore: రాపూరు మేజర్ పంచాయతీ వైసీపీ అభ్యర్థిగా వందన నామినేషన్!
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా వేటూరి వందన భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పాల్గొన్నారు.
Nellore: రాపూరు మేజర్ పంచాయతీ వైసీపీ అభ్యర్థిగా వందన నామినేషన్!
నెల్లూరు: నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా వందన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యులు పాపకన్ను మధుసూదన్ రెడ్డి, ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీ మురళీధర్, రాపూరు మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పిచ్చిరెడ్డి బిల్డింగ్ నుంచి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు.
అనంతరం పార్టీ శ్రేణుల సమక్షంలో వందన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో రాపూరులో రాజకీయ సందడి నెలకొంది. మేజర్ పంచాయతీలో వైసీపీ అభ్యర్థి వందన నామినేషన్‌తో ఎన్నికల వేడి మరింత పెరిగింది.




