Rapur: రాపూరు గ్రంథాలయంలో మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలు!

Rapur: నెల్లూరు జిల్లా రాపూరు శాఖా గ్రంథాలయంలో ఘనంగా గురజాడ అప్పారావు జయంతి వేడుకలు. పాల్గొన్న గ్రంథాలయ అధికారి, ఉపాధ్యాయులు.

Yellayya, Nellore
Published on: 21 Sept 2026 11:57 AM IST
Rapur
X

Rapur: రాపూరు గ్రంథాలయంలో మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలు!

Rapur: నెల్లూరు జిల్లా రాపూరు శాఖా గ్రంథాలయంలో మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి అంజయ్య మాట్లాడుతూ.. సమాజ చైతన్యానికి గురజాడ అప్పారావు చేసిన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం, “దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్” వంటి గేయాలు సమాజానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలాజీ, భాస్కర్‌రెడ్డి, చిన్నస్వామి, డమ్మాయి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore