Rapur: గోనుపల్లిలో 9 నామినేషన్ల తిరస్కరణ.. ఏకగ్రీవం దిశగా టీడీపీ!
Rapur: రాపూరు మండలం గోనుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల స్క్రూటినీలో దాఖలైన 11 నామినేషన్లలో 9 తిరస్కరణకు గురయ్యాయి. బరిలో టీడీపీ అభ్యర్థి అశోక్ నాయుడు నిలిచారు.
Rapur: గోనుపల్లిలో 9 నామినేషన్ల తిరస్కరణ.. ఏకగ్రీవం దిశగా టీడీపీ!
రాపూరు: మండలంలోని గోనుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఆసక్తికర మలుపు తిరిగింది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియలో భాగంగా దాఖలైన 11 నామినేషన్లలో 9 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు దాఖలు చేసిన రెండు నామినేషన్లు మాత్రమే ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచాయి.
రాపూరు మండలంలో పంచాయతీ ఎన్నికల వేడి నెలకొన్న నేపథ్యంలో, గోనుపల్లి సర్పంచ్ స్థానానికి మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు ఉదయం నుంచి అధికారులు నిర్వహించిన నామినేషన్ల పరిశీలనలో వివిధ కారణాలతో 9 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి.
ప్రస్తుతం బరిలో టీడీపీ తరపున అశోక్ నాయుడు, మరో డమ్మీ అభ్యర్థి నామినేషన్లు మాత్రమే ఆమోదం పొందాయి. ఈ నెల 27వ తేదీన జరగనున్న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో డమ్మీ అభ్యర్థి తన నామినేషన్ను విత్డ్రా చేసుకుంటే, గోనుపల్లి సర్పంచ్ స్థానం టీడీపీ ఖాతాలో ఏకగ్రీవం కానుంది. దీంతో టీడీపీ అభ్యర్థి అశోక్ నాయుడు విజయం దాదాపు ఖాయమైందని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.




