Atmakur: కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించనున్న నిర్వాహకులు!

Atmakur: నలపరెడ్డిపల్లి – మురగళ్ల – కనుపూరుపల్లి ప్రధాన రహదారి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ తోడేటి అశోక్ ఆధ్వర్యంలో ప్రజా సంతకాల సేకరణ నిర్వహించారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 27 Sept 2026 6:21 PM IST
Atmakur
X

Atmakur: కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించనున్న నిర్వాహకులు!

Atmakur: నలపరెడ్డిపల్లి – మురగళ్ల – కనుపూరుపల్లి గ్రామాలను కలిపే ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, నిలిచిపోయిన రహదారి నిర్మాణ పనులను వెంటనే పునఃప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – ఆత్మకూరు మండల SC సెల్ అధ్యక్షులు తోడేటి అశోక్ ఆధ్వర్యంలో ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈరోజు అడ్డరోడ్డు వద్ద పెట్రోల్ బంక్ సమీపంలోని బస్ షెల్టర్ వద్ద నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి మూడు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ మద్దతు తెలిపారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 200 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం సాయంత్రం 5.00 గంటల వరకు కొనసాగింది.

ఈ కార్యక్రమానికి ఆత్మకూరు జడ్పీటీసీ సభ్యురాలు ప్రసన్నలక్ష్మి, ఆత్మకూరు నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, శంకరయ్య, కొండయ్య, వెంకటేశ్వర్లు, పెంచల నరసయ్య, ఆదినారాయణ, శ్రీధర్, సుమంత్, బద్రి, హరిబాబు, విజయసారథి, ప్రణయ్ తదితరులు హాజరై కార్యక్రమానికి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన నలపరెడ్డిపల్లి, మురగళ్ల, కనుపూరుపల్లి గ్రామాల ప్రజలకు తోడేటి అశోక్ కృతజ్ఞతలు తెలిపారు.

మూడు గ్రామాల ప్రజలు నిత్యం ప్రయాణించే ఈ ప్రధాన రహదారి అధ్వాన్నంగా ఉండటంతో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ప్రజల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రేపు ఉదయం 11.00 గంటలకు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి సమర్పించి నిలిచిపోయిన రహదారి నిర్మాణ పనులను వెంటనే పునఃప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు.ప్రజా సమస్య పరిష్కారం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమానికి మూడు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు ఇవ్వడం పట్ల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)