Vidavaluru: విడవలూరు టీడీపీ కంచుకోట: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Vidavaluru: విడవలూరు మండలం టీడీపీకి కంచుకోట అని నిరూపిస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 29 Oct 2026 5:09 PM IST
Vidavaluru
X

Vidavaluru: విడవలూరు టీడీపీ కంచుకోట: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

విడవలూరు: విడవలూరు మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపిస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. అందరికీ మంచి జరగాలంటే మరోసారి కూటమికి మద్దతు తెలపాలని కోరారు.

‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం విడవలూరు మండలంలోని రామతీర్థం, రామచంద్రాపురం, పెద్దపాళెం, గాదెలదిన్నె, వావిళ్ల, దంపూరు, చౌకచర్ల గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామాల అభివృద్ధి మరింత వేగంగా కొనసాగాలంటే స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

"కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం"

విడవలూరు జడ్పీటీసీ అభ్యర్థి చౌటూరు వెంకట శేషమ్మతో పాటు రామతీర్థం ఎంపీటీసీ అభ్యర్థి శ్రీహరికోట గోపీ, రామచంద్రాపురం అభ్యర్థి కోడూరు విజయమ్మ, పెద్దపాళెం అభ్యర్థి రామలక్ష్మి, గాదెలదిన్నె–వరిణి–దండిగుంట అభ్యర్థి కరిష్మా, వావిళ్ల అభ్యర్థి వెంకట ప్రసాద్‌, దంపూరు అభ్యర్థి నగిరిపాటి లావణ్య, చౌకచర్ల అభ్యర్థి కొల్లు పుష్పలతకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రచారం నిర్వహించారు.

గ్రామాల్లో ప్రజలను నేరుగా కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, విడవలూరు మండలంలో పార్టీ బలాన్ని మరోసారి చాటాలని పిలుపునిచ్చారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE