Gudur: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఐరన్ ర్యాక్‌లు విరాళం ఇచ్చిన దాతలు!

Gudur: గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రెండు ఐరన్ ర్యాక్‌లు విరాళంగా అందజేసిన ప్రగతి సేవా సంస్థ. వివాహ వార్షికోత్సవం వేళ ఆదర్శ సేవలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Oct 2026 1:28 PM IST
Gudur
X

Gudur: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఐరన్ ర్యాక్‌లు విరాళం ఇచ్చిన దాతలు!

Gudur: గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదర్శవంతమైన సేవా కార్యక్రమం జరిగింది. ప్రగతి సేవ సంస్థ సభ్యుడు వాకాటి రామమోహన్ రావు తన కుమార్తె జాహ్నవి, అల్లుడు గోపాలకృష్ణల 25వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుపత్రికి రెండు ఐరన్ ర్యాక్‌లను విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ కుటుంబ వేడుకల వేళ ప్రజావసరాలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆదర్శనీయమని ఆసుపత్రి పరిపాలనా విభాగంలో రికార్డుల భద్రత కోసం వీటిని సమకూర్చడంతో పాటు సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా మాట్లాడుతూ, రికార్డుల నిర్వహణకు అవసరమైన ర్యాక్‌లను సమకూర్చిన దాతకు, ప్రగతి సేవా సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ ఎం ఓ దాత వాకాటి రామమోహన్ రావు, పయ్యావుల మురళి నాయుడు, ఇంతియాజ్, పసుపులేటి ప్రసాద్, ఇస్మాయిల్, విజయ్, నాగేంద్ర, ఆసుపత్రి సిబ్బంది మౌలాలి పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్