Nellore: హామీలు నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ నైజం: పొంగూరు సింధూర!

Nellore: నెల్లూరులో మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ పొంగూరు సింధూర ప్రచారం. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడమే కూటమి ధ్యేయమని స్పష్టీకరణ.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 26 Oct 2026 4:12 PM IST
Nellore
X

Nellore: హామీలు నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ నైజం: పొంగూరు సింధూర!

Nellore: ప్రతిపక్ష వైసిపి నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎన్నికలను అడ్డుకోవాలని ప్రయత్నించారని, ఎన్నికలు జరిగితే 16వ ఫైనాన్స్ కమిషన్ నుండి వచ్చే 12 వేల కోట్ల నిధులు రాకుండా చేసేందుకు అనేక కుట్రలు పన్నారని వాటిని ఎన్ డి ఏ ప్రభుత్వం తిప్పి కొట్టి ఎన్నికల సజావుగా జరిగేలా చర్యలు చేపట్టిందని, నెల్లూరు నగరాన్ని మంత్రి నారాయణ నేతృత్వంలో సుందర నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఇవ్వని ఎన్నో హామీలను కూడా తన భుజస్కందాల మీద వేసుకున్న ఘనత మంత్రి నారాయణ కే దక్కిందని నారాయణ కుమార్తె డాక్టర్ పొంగూరు సింధూర అన్నారు. సోమవారం నగరంలోని స్థానిక బాలాజీ నగర్ 19, 22వ డివిజన్లలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ప్రతిపక్ష వైసిపి నాయకులు ఎన్నికలు జరగకుండా అడ్డుకున్న తీరును ప్రజలకు వివరించారు. నారాయణ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నెల్లూరు నగరంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని సుందర నందనవనంల తీర్చిదిద్దారని పార్కులు, డ్రైన్లు, రోడ్లు బాగుచేసి హరిత విప్లవాన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఇవన్నీ కేవలం రెండేళ్ల మూడు నెలల కాలంలోనే జరిగాయని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారని తెలిపారు. కూటమి అభ్యర్థిగా రూపు కుమార్ యాదవ్ను అలాగే కార్పొరేట్ అభ్యర్థులు ఉచి భువనేశ్వరి ప్రసాద్, కర్తం ప్రతాపరెడ్డిలను ఆశీర్వదించి ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నేతలు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE