Nellore: నెల్లూరులో జె గోల్డ్ ఎక్స్‌పో ప్రారంభం ఆకట్టుకుంటున్న ఆభరణాలు

Nellore: నెల్లూరు ఆచారి వీధిలో జె గోల్డ్ ఎక్స్‌పోను పొంగూరు షరణి ప్రారంభించారు. ఈ ఆభరణాల ప్రదర్శన అక్టోబర్ 14 నుండి 18 వరకు కొనసాగుతుంది.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 14 Oct 2026 5:24 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో జె గోల్డ్ ఎక్స్‌పో ప్రారంభం ఆకట్టుకుంటున్న ఆభరణాలు

Nellore: మహిళా సాధికారతకు ప్రతీకగా నారీ శక్తి కాన్సెప్ట్‌తో నిర్వహించిన అద్భుతమైన వేడుకలో భాగంగా, రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు షరణి నెల్లూరు ఆచారి వీధిలోని బార్కాస్ సెంటర్‌లో అక్టోబర్ 14 నుండి 18 వరకు జరగనున్న జె గోల్డ్ ఇన్-స్టోర్ ఎక్స్‌పోను ప్రారంభించారు.

ముందుగా రిబ్బన్ కట్ చేసి, ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె అక్కడ ఉన్న డిజైన్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. మహిళల మనసును హత్తుకునే సరికొత్త తాళి చైన్లు, బ్లాక్ బీడ్స్ (నల్లపూసలు),మంగళసూత్రాలు, గోల్డ్ చైన్లు మరియు డైమండ్ ఆభరణాల ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్ ఇక్కడ లభిస్తుందని ఆమె తెలిపారు.

ఈ ఆభరణాలన్నీ బయటి నుంచి తెచ్చినవి కాకుండా, మార్కెట్లో ఎక్కడా దొరకని ప్రత్యేకమైన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్లతో రూపుదిద్దుకున్నాయని చెప్పారు. కస్టమర్ల నమ్మకమే లక్ష్యంగా, ప్రతి ఒక్కరి బడ్జెట్‌కు సరిపోయేలా బేసిక్, రీజనబుల్ రేట్లతో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో వీటిని అందుబాటులో ఉంచారన్నారు.

గత 14 సంవత్సరాలుగా నెల్లూరులో సేవలందిస్తున్న రాహుల్ జైన్ అద్భుతమైన ఆధ్వర్యంలో ఈ సంస్థ ముందుకు వెళ్తోందని కొనియాడారు. అంతేకాకుండా ఈ సందర్భంగా అధికారికంగా వెబ్‌సైట్‌ను కూడా లాంచ్ చేశామని తెలుపుతూ, నెల్లూరు ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు ఈ ఎక్స్‌పోను సందర్శించి డిజైన్లను తిలకించి షాపింగ్ చేయాలని పొంగూరు షరణి పిలుపునిచ్చారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE