Podalakur: పొదలకూరులో పోలీసుల స్పెషల్ డ్రైవ్ హెల్మెట్ పై అవగాహన!

Podalakur: పొదలకూరు రాంనగర్ గేట్ సెంటర్‌లో ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అవగాహన కల్పించారు.

Yellayya, Nellore
Published on: 21 Sept 2026 7:59 PM IST
Podalakur
X

Podalakur: పొదలకూరులో పోలీసుల స్పెషల్ డ్రైవ్ హెల్మెట్ పై అవగాహన!

Podalakur: పొదలకూరు పట్టణంలోని రాంనగర్ గేట్ సెంటర్‌లో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గుత్తి వెంకటేశ్వర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ శివ రాకేష్ లు పాల్గొని వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై స్పష్టమైన సూచనలు చేశారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేనిపక్షంలో జరిగే రోడ్డు ప్రమాదాల తీవ్రత, ప్రాణనష్టం గురించి వివరించారు. అలాగే మద్యం మత్తులో వాహనాలు నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్) వల్ల కలిగే తీవ్ర నష్టాలను, చట్టపరమైన చర్యలను ప్రజలకు స్పష్టంగా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని, వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు కోరారు.

Yellayya, Nellore

Yellayya, Nellore