Nellore: నెల్లూరులో వృద్ధాశ్రమంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం!

Nellore: నెల్లూరులో పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమెరికాలో ఉద్యోగం సాధించిన లక్ష్మీప్రియను అభినందించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 30 Sept 2026 5:35 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో వృద్ధాశ్రమంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం!

Nellore: నెల్లూరు, నక్కల కాలనీలోని ఆస్థాన శిష్టియ వృద్ధుల ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా పి.హెచ్.పి గౌరవాధ్యక్షులు అనుముల జయప్రకాష్ మాట్లాడుతూ అమెరికాలో ఉద్యోగం సాధించిన వెలినేని లక్ష్మీప్రియ తన మొదటి నెల జీతంతో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.

ఈ సందర్భంగా వృద్ధులకు భోజనం వడ్డించి, వారి ఆశీస్సులు పొందారు. తన తొలి సంపాదనలో కొంత భాగాన్ని వృద్ధుల సేవకు వినియోగించడం ద్వారా లక్ష్మీప్రియ సేవాభావాన్ని చాటుకున్నారని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఆర్థికంగా ఎదిగిన ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయాన్ని అవసరమైన వారికి అందించాలని, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని జయప్రకాష్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్, జిల్లా పీ.హెచ్.పీ నాయకులు శాఖవరపు వేణుగోపాల్, గోరంట్ల శేషయ్య, దేవరకొండ శ్రీనివాసులు, వల్లటూరు పార్వతి, యాకశిరి శైలజ, వృద్ధాశ్రమ నిర్వాహకులు ఆసిఫ్ భాష తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE