Gudur: గూడూరులో ఘనంగా దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు!
Gudur: గూడూరు పట్టణ బీజేపీ కార్యాలయంలో పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
Gudur: గూడూరులో ఘనంగా దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు!
Gudur: గూడూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను గూడూరు అర్బన్ బీజేపీ అధ్యక్షుడు కే. దయాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముందుగా దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గూడూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు కే. దయాకర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ, దీనదయాళ్ ఉపాధ్యాయ దేశానికి అందించిన సేవలను కొనియాడారు.
దీనదయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్ అభివృద్ధికి విశేష కృషి చేశారని, ఆయన ప్రవచించిన అంత్యోదయ, ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాలు సమాజంలోని చివరి వ్యక్తి అభ్యున్నతికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు. సమాజంలోని పేదలు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు.
దీనదయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శులు బాలకృష్ణ గౌడ్,ఎం రవీంద్ర,ఉపాధ్యక్షులు ఐ. సురేష్ బాబు,గుమ్మడి శ్రీనివాసులు,కోశాధికారి నిరంజన్,ఓబీసీ మోర్చా అధ్యక్షులు కటికాల సురేష్, సి హెచ్ మస్తాన్ ,మహిళా మోర్చా అధ్యక్షులు బాలమణి,ఎస్సీ మోర్చా అధ్యక్షులు మధుసూదన్,మహిళా నాయకులు గుంజి భవాని, తదితరులు పాల్గొన్నారు.




