Nellore: ఉదయగిరిలో ‘పల్లె పండుగ 3.0’ ఏర్పాట్ల పరిశీలన!
Nellore: వరికుంటపాడు రామాపురంలో ‘పల్లె పండుగ 3.0’ ఏర్పాట్లను పరిశీలించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఈనెల 29న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక.
Nellore: ఉదయగిరిలో ‘పల్లె పండుగ 3.0’ ఏర్పాట్ల పరిశీలన!
నెల్లూరు: నెల్లూరు జిల్లా పల్లె పండుగ 3.0 ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. ఈ నెల 29వ తేదీన ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో నిర్వహించనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్న నేపథ్యంలో సభా ప్రాంగణం, సభా వేదిక, పార్కింగ్, హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ పరిశీలనలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు కంభం విజయరామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,
రాష్ట్ర చైర్మన్లు శివ ప్రసాద్, కేకే చౌదరి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సభా ప్రాంగణం, పార్కింగ్, రాకపోకలు, భద్రత, హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.




