Nellore: కేఏసీ జూనియర్ కళాశాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి!
Nellore: నెల్లూరు కేఏసీ జూనియర్ కళాశాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రి నారాయణకు వినతి పత్రం సమర్పించిన పీఏఏపీ ప్రతినిధులు.
Nellore: కేఏసీ జూనియర్ కళాశాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి!
Nellore: నెల్లూరు నగరంలోని చారిత్రాత్మక కె.ఎ.సి. (KAC) జూనియర్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న గ్రామీణ, పేద విద్యార్థుల విద్యా సౌకర్యాల మెరుగుదల కోసం మరియు మౌలిక వసతుల కల్పన కోరి ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) ఆధ్వర్యంలో రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖా మంత్రివర్యులు గౌరవనీయులైన పి. నారాయణ కి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మంత్రివర్యులు స్వయంగా కళాశాల అధ్యాపకులు, అధికారులు, విద్యార్థి తల్లిదండ్రులు మరియు PAAP ప్రతినిధులతో కలిసి పరిశీలన జరిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
స్పందించిన మంత్రివర్యులు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ హాజరైన తల్లిదండ్రులకు భరోసా కల్పించారు.
ప్రధాన డిమాండ్లు
హాస్టల్ వసతి కల్పన కె.ఎ.సి. కళాశాలలో చదువుతున్న సుమారు 650 మంది గ్రామీణ, పేద విద్యార్థుల సౌకర్యార్థం, కళాశాలకు అతి సమీపంలో ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ చిన్నపిల్లల ఆసుపత్రి భవనాలను ప్రత్యేక నిధులతో బాగుచేసి పేద విద్యార్థుల కోసం సుసజ్జితమైన హాస్టల్‌ను ఏర్పాటు చేయాలి.
నూతన భవన నిర్మాణం: కళాశాలలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదుల కొరత తీవ్రంగా ఉన్నందున, శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని తొలగించి ఆ స్థలంలో ప్రభుత్వ బడ్జెట్ లేదా CSR నిధులతో అదనపు తరగతి గదుల నూతన భవనాన్ని నిర్మించాలి.
మినరల్ వాటర్ ప్లాంట్ పునరుద్ధరణ: సుమారు రూ. 30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్‌ను వెంటనే మరమ్మత్తులు చేసి అందుబాటులోకి తెచ్చి, కళాశాల విద్యార్థుల దాహార్తిని తీర్చాలి.
ఈ కార్యక్రమంలో PAAP రాష్ట్ర అధ్యక్షులు శిఖరం నరహరి, ఉపాధ్యక్షులు భవనాసి.సురేష్ , కె. ప్రవీణ్ యన్. చంద్రశేఖర్, ఎస్.కె. మునాఫ్, శ్రీకాంత్ తదితర విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.




