Sangam: హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు

Sangam: నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడులో హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ సారంగపాణి, ఎంపీడీఓ, ఎస్‌ఐ పరిశీలించి భద్రతపై ఆరా తీశారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 7 Oct 2026 6:05 PM IST
Sangam
X

Sangam: హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు

సంగం: నెల్లూరు జిల్లా సంగం మండలంలోని మర్రిపాడు గ్రామంలో హైపర్ సెన్సిటివ్‌గా గుర్తించిన పోలింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలించారు.

తహసీల్దార్ సారంగపాణి, ఎంపీడీఓ షాలెట్, ఎస్‌ఐ భోజ్యా నాయక్ లు కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలపై అధికారులు దృష్టి సారించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు, సమస్యాత్మక పరిస్థితులు తలెత్తే అవకాశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)