Nellore: నెల్లూరు కమాండ్ సెంటర్‌కు స్మార్ట్ సిటీ అవార్డు!

Nellore: నెల్లూరు నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ రియల్ టైమ్ మానిటరింగ్ విశిష్ట సేవలకు గాను అంతర్జాతీయ 2026 ఐఈఈఈ స్మార్ట్ సిటీస్ కాంటెస్ట్‌లో ద్వితీయ బహుమతి సాధించింది.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 28 Nov 2026 11:44 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు కమాండ్ సెంటర్‌కు స్మార్ట్ సిటీ అవార్డు!

Nellore: నెల్లూరు నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తుగా అంతర్జాతీయ 2026 ఐ.ఈ.ఈ.ఈ స్మార్ట్ సిటీస్ కాంటెస్ట్ లో ద్వితీయ బహుమతిని సాధించిందని కమిషనర్ వై.ఓ నందన్ శుక్రవారం ప్రకటించారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ విధానంపై ఆన్లైన్ లో జరిగిన అంతర్జాతీయ పోటీకి పూర్తి వివరాలతో దరఖాస్తు చేయగా బహుమతి సాధించామని కమిషనర్ హర్షం వ్యక్తం చేశారు.బహుమతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, టి.పి.ఆర్.ఓ వాసుబాబు లు కమిషనర్ కు ఆయన ఛాంబర్ లో అందజేశారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE