Nellore: ఎమ్మెల్సీ బీద రవిచంద్రను కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్!
Nellore: నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో 80,170 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు.
Nellore: ఎమ్మెల్సీ బీద రవిచంద్రను కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్!
Nellore: నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి 80,170 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్రను నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా భారీ విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్‌ను బీద రవిచంద్ర శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మిఠాయి తినిపించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. నెల్లూరు నగరంలో కూటమి విజయంతో తెలుగుదేశం శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.




