Nellore: యానాది కార్పొరేషన్ కోసం నెల్లూరులో గాంధీ మాస్కులతో నిరసన
Nellore: ఎస్టీ వర్గీకరణ, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ జయంతి వేళ నెల్లూరులో యానాదుల సంక్షేమ సంఘం వినూత్న నిరసన చేపట్టింది.
Nellore: యానాది కార్పొరేషన్ కోసం నెల్లూరులో గాంధీ మాస్కులతో నిరసన
Nellore: గాంధీ జయంతి సందర్భంగా యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరులో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.ప్రత్యేక యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, యానాదులకు ఎస్టీ వర్గీకరణ కల్పించాలని డిమాండ్ చేస్తూ గాంధీ మాస్క్‌లు ధరించి, మెడలో ప్లకార్డులు వేసుకుని నిరసన తెలిపారు.
నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని యానాదుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
అలాగే యానాదులకు ఎస్టీ వర్గీకరణ అంశంపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, ఆ కమిషన్ నివేదిక ఆధారంగా వర్గీకరణ ప్రక్రియను చేపట్టాలని కోరారు.
ప్రభుత్వం తమ రెండు ప్రధాన డిమాండ్లపై స్పందించి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో నవంబర్‌లో యానాదుల ఆధ్వర్యంలో ధూమ్‌ధామ్ కార్యక్రమం నిర్వహిస్తామని నాయకులు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.సి. పెంచలయ్య యానాది, జిల్లా అధ్యక్షులు మానికల మురళి, జిల్లా చైర్మన్ రాపూరు కృష్ణయ్య, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తీరివీధి సతీష్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యల్లంపల్లి రమేష్, యువజన విభాగం నాయకులు బిట్ర ప్రసాద్, కల్లూరు పెంచల ప్రసాద్, రేపల్లె మధు, చల్లంచర్ల చిన్న సుబ్బయ్య, ఇండ్ల వేణు, ప్రసాద్ రవి, శ్రీను, యాకసిరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే నెల్లూరు నగర మహిళా విభాగం అధ్యక్షురాలు కల్లూరు వరలక్ష్మి, మహిళా విభాగం నాయకులు చల్లంచర్ల కలుగోలమ్మ, చల్లంచర్ల తిరుపతమ్మ, సీనియర్ నాయకులు మద్దాలి ఇశ్రాయేలు,యానాది ఉద్యోగుల సంఘం నాయకులు ఏకొల్లు సుధాకర్, చల్లంచర్ల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
"ప్రత్యేక యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి"
"ఎస్టీ వర్గీకరణ అమలు చేయాలి"
"యానాదుల హక్కులను పరిరక్షించాలి"
"మహాత్మా మీరైనా కరుణించండి"
"యానాదుల న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం చూపండి"




