Nellore: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతి
Nellore: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వీసీ అల్లం శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు.
Nellore: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతి
నెల్లూరు: మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో విఎస్‌యూ వైస్ ఛాన్స్లర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పరిపాలనా భవనం వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహానికి వైస్ ఛాన్స్లర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు నివాళులర్పించారు.
వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి మార్గాలను అనుసరించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింసా సిద్ధాంతాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, నిజాయితీ, క్రమశిక్షణ, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని అన్నారు. దేశం పట్ల ఆయన చూపిన అంకితభావం, సేవా స్ఫూర్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను విద్యార్థులు, యువత ఆదర్శంగా తీసుకుని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని వైస్ ఛాన్స్లర్ పిలుపునిచ్చారు. వారి విలువలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో సానుకూల మార్పును తీసుకురావచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య టి.వీరారెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ఆచార్య సిహెచ్. విజయ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. విజయలక్ష్మి, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఆర్. మధుమతి, అడిషనల్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఎన్ ఓ. గోపాల్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య ఎం.హనుమారెడ్డి, సహాయక రిజిస్ట్రార్ డాక్టర్ జి.సుజయ్ అధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి సేవలను స్మరించుకున్నారు.




