Nellore: పెద్దల ఆశీస్సులతో 21వ డివిజన్ అభివృద్ధి విజయలక్ష్మి
Nellore: నెల్లూరు 21వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన విజయలక్ష్మీ గునుకుల. పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిలకు కృతజ్ఞతలు.
Nellore: పెద్దల ఆశీస్సులతో 21వ డివిజన్ అభివృద్ధి విజయలక్ష్మి
నెల్లూరు: నెల్లూరు నగరంలోని 21వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు కార్పొరేటర్ విజయలక్ష్మీ గునుకుల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తన విజయానికి అండగా నిలిచి, ప్రోత్సహించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పొంగూరు నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు.
అదేవిధంగా తన విజయానికి విశేషంగా సహకరించి, డివిజన్‌లో ప్రజాదరణ పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంతి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్‌లను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.




