Nellore: 21వ డివిజన్లో ముమ్మరంగా విజయలక్ష్మి గునుకుల ప్రచారం
Nellore: నెల్లూరు 21వ డివిజన్లో కూటమి జనసేన అభ్యర్థి విజయలక్ష్మి గునుకుల ప్రచారం. ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని ధీమా.
Nellore: 21వ డివిజన్లో ముమ్మరంగా విజయలక్ష్మి గునుకుల ప్రచారం
నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 21వ డివిజన్లో కూటమి బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి విజయలక్ష్మి గునుకుల, నగర మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్‌లకు మద్దతుగా రామ్‌జీ నగర్ అపార్ట్మెంట్ స్థానికులతో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. గతంలో ఈ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులకు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధికి మధ్య ఉన్న మార్పులను వివరిస్తూ, నగర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ అభ్యర్థి విజయలక్ష్మి గునుకుల మాట్లాడుతూ, ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. డివిజన్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.
నెల్లూరు నగర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




