Nellore: రామతీర్థం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా భాషా ఖరారు!
Nellore: నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా ప్రళయ కావేరి భాషా పేరును మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.
Nellore: రామతీర్థం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా భాషా ఖరారు!
నెల్లూరు: విడవలూరు మండలం, రామతీర్థం గ్రామానికి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా ప్రళయ కావేరి భాషాని మాజీ మంత్రి, కోవూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు. గురువారం నెల్లూరులోని తన నివాసంలో ఈ ప్రకటన చేశారు.
ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు కాటంరెడ్డి నవీన్ రెడ్డి, నెల్లూరు చెంచురత్నం ,దాసరి వెంకటేశ్వర్లు, దాసరి కరుణాకర్, నాటారు భాస్కర్, తంబి రామలింగయ్య, నిమ్మల శివ కుమార్,పూడి శ్రీనివాసులు, కొండూరు చంద్రశేఖర్, నాటరు చంద్రయ్య, నడవడి శ్రీనివాస్, బుచ్చింగారి లక్ష్మయ్య, కోడూరు హరి, కే సుబ్రహ్మణ్యం, ఉప్పాల కోటయ్య, గ్రంధి రమేష్ తోపాటు రామతీర్థం పంచాయతీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




