Nellore: మహాలక్ష్మీపురంలో గురుకుల విద్యార్థినుల ఆటో బోల్తా!

Nellore: తోటపల్లిగూడూరు మండలం మహాలక్ష్మీపురం గురుకుల పాఠశాల ఆటో బోల్తా: ఎనిమిది మంది విద్యార్థినులు, టీచర్‌కు గాయాలు, ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంపై విచారణకు తల్లిదండ్రుల డిమాండ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Sept 2026 9:36 PM IST
Nellore
X

Nellore: మహాలక్ష్మీపురంలో గురుకుల విద్యార్థినుల ఆటో బోల్తా!

నెల్లూరు: తోటపల్లిగూడూరు మండలం మహాలక్ష్మీపురం ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను పక్కనే ఉన్న సచివాలయంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్లాసుల పేరుతో మూడు ఆటోల్లో ప్రిన్సిపాల్ తరలించారు. వారితోపాటు ఒక టీచర్ ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థినిలు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న సిమెంట్ ఆటో ఢీకొనడంతో ఆటో బోల్తా పడి ప్రమాదానికి గురి అయ్యారు.

ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలు కాగా టీచర్ కు తీవ్ర గాయాలు కావడంతో కిమ్స్ వైద్యశాలకు తరలించారు. ఎనిమిది మంది విద్యార్థులను జి జి హెచ్ ప్రభుత్వ ఆస్పిటల్ కు తరలించారు. విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి గురుకుల పాఠశాలలో చదువుతున్నారు.

విద్యార్థులకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా ఉన్నారు అని ఆవేదన చెందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను కలెక్టర్ విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్